Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) సినిమాలకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ (Myositis) అనే వ్యాధి బారిన పడిన సామ్.. దాని చికిత్స కోసం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ ‘ఖుషీ’ (Kushi) సినిమాతో పాటు, సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ పూర్తైన వెంటనే సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనిపై సామ్ స్వయంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సామ్ షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీ చూస్తే మాత్రం అది నిజమని తెలుస్తోంది.
ఈ ఆరునెలలు చాలా కష్టతరంగా గడిచాయని సమంత తెలిపింది. ఎట్టకేలకు ముగింపుకు వచ్చినట్లు చెప్పింది. కారవాన్ లైఫ్.. మరో మూడు రోజులు మాత్రమే అని పేర్కొంటూ సెల్ఫీ ఫొటో షేర్ చేసింది. ఆ ఫొటోలో సమంత చాలా బలహీనంగా, ముఖం అంతా పీక్కుపోయి కనిపిస్తోంది. సామ్ పోస్ట్ చూసిన నెటిజన్లు, అభిమానులు ‘బీ స్ట్రాంగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గత కొన్నిరోజులుగా సమంత మయోసైటిస్ అనే ఆటోఇమ్మూనిటీ డిసీజ్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘యశోద’ చిత్రం తర్వాత మయోసైటిస్ కారణంగా కాస్త బ్రేక్ తీసుకుంది కూడా. ఆ తర్వాత శాకుంతలం పూర్తి చేసింది. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’(Citadel), టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ ( Kushi) చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే వరుణ్ తో కలిసి సిటాడెల్ షూటింగ్ సెర్బియాలో కంప్లీట్ చేసింది. ఖుషీ షూటింగ్ షెడ్యూల్ కూడా త్వరలో పూర్తి కానుంది.
అయితే మయోసైటిస్ నుంచి సామ్ ఇంకా పూర్తిగా కోలుకోలేని కారణంగా.. తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. ఇందులో భాగంగానే ఒక ఏడాది పాటు సినిమాలకు లాంగ్ బ్రేక్ (break from acting) ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖుషీ, సిటాడెల్ తర్వాత సామ్ కు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సహా మరే ఇతర భాషలో కొత్త చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసే ఆలోచన లేదట.
వాస్తవానికి ఖుషీ సినిమా తర్వాత తాను పని చేయాలనుకుంటున్న ప్రాజెక్టుల కోసం ముందుగా తీసుకున్న అడ్వాన్స్ ను కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసిందని సమాచారం. డిసీజ్ నుంచి పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయిన తర్వాతే సినిమాల్లోకి రావాలని సామ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
Also Read..
Heavy Rains | ఉత్తరాదిని వణికిస్తున్న భారీ వర్షాలు.. 22కు పెరిగిన మృతుల సంఖ్య
Esha Rebba | టాలీవుడ్లో వాళ్లకే హీరోయిన్లుగా ఛాన్స్‌లు ఇస్తారు.. ఈషా రెబ్బా సంచలన వ్యాఖ్యలు