ఒడిదుడుకుల్ని సైతం ఎంజాయ్ చేయడం సమంతకే చెల్లు. జీవితంలోని ప్రతి కుదుపూ ఆమెను రాటుదేలేలా చేశాయని చెప్పాలి. తన చేదు అనుభవాలకు చెందిన ఆలోచనలన్నింటికీ పనితో చెక్ పెట్టేస్తారామె. చేస్తే సినిమాలు చేయడం, లేకపోతే అందమైన ప్రదేశాలకు వెళ్లి ప్రకృతిని ఎంజాయ్ చేయడం.. ఇది సమంత లైఫ్ైస్టెల్. అమెరికా వెళ్లి అక్కడ మయోసైటిస్కి ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఖాళీ దొరికినప్పుడల్లా అమెరికా అందాలను ఆస్వాదిస్తున్నారు సమంత.
ఆ ఫొటోలను తన సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ, మంచి మంచి కొటేషన్స్ ఇస్తున్నారు. రీసెంట్గా అమెరికాలోని ఓ రెస్టారెంట్లో అభిమానులకు ముద్దిస్తున్నట్టుగా స్టిల్ పోస్ట్ చేసి ‘జీవితంలో ఎదురయ్యే బాధలన్నింటికీ మందు కాలమే. కాలం గడిచే కొద్దీ గాయం నయమవుతుంది. మనసుకు తగిలిన గాయానికి కూడా కాలమే మందు’ అంటూ ఓ కొటేషన్ పోస్ట్ చేశారు సమంత. ఇటీవల రిలీజైన ‘ఖుషి’ సినిమాలోని ఆరాధ్య పాత్ర సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో కూడా కొన్ని సినిమాలకు సామ్ సైన్ చేసినట్టు సమాచారం.