Samantha | హీరోయిన్లందరూ సోషల్‌మీడియాలో యాక్టివే. కాకపోతే సమంత వారికంటే కాస్త ఎక్కువ యాక్టివ్. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ అందరితో పంచుకుంటూ ఉంటుంది. ఏ విషయం లేకపోయినా కనీసం ఫొటోలయినా పోస్ట్ చేస్తుంది. రీసెంట్గా అభిమానులతో తన వ్యక్తిగత ఖాతా ద్వారా చిట్‌చాట్ నిర్వహించింది సామ్. అందులో నెటిజన్స్ అడిగిన పలు వింత ప్రశ్నలకు అంతే వింతగా సమాధానాలిచ్చేసింది.
ఓ నెటిజన్ ‘మళ్లీ పెళ్లి గురించి మీరెందుకు ఆలోచించరు?’ అని అడిగిన ప్రశ్నకు సామ్ వెరైటీ ఆన్సర్ ఇచ్చారు. విడాకులకు సంబంధించిన లేటెస్ట్ గణాంకలను అతనికి చూపిస్తూ.. ‘చూశారా.. పెళ్లి బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్.. అవసరమా చెప్పండి? అని ఒక స్మైలీ ఎమోజీని కూడా ఆ కామెంట్‌తో షేర్ చేసింది సామ్. తను చూపించిన గణాంకాల్లో.. 2023లో విడిపోయినవాళ్లు 50శాతం ఉండగా, రెండోసారి పెళ్లిచేసుకుని విడిపోయినవాళ్లు 67శాతం, మూడోసారి పెళ్లాడి విడిపోయినవాళ్లు 73శాతం ఉన్నారు.