Salaar 2 | ప్రభాస్ ‘సలార్ 2’ సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే.!
Salaar Movie | బాహుబలి తర్వాత ‘సలార్’తో ( Salaar) ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రెబల్‌స్టార్ ప్రభాస్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టామీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.
Salaar Movie | బాహుబలి తర్వాత ‘సలార్’తో ( Salaar) ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రెబల్‌స్టార్ ప్రభాస్. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మరోసారి డార్లింగ్ (Prabhas) స్టామీనాను ఇండస్ట్రీకి చాటిచెప్పింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రభాస్‌కు, ఆయన అభిమానులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. మొదటి పార్ట్ సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్ అంటూ రాగా.. సలార్: పార్ట్ 2-శౌర్యంగ పర్వం అంటూ రాబోతుంది. అయితే పార్ట్ 2 అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు అయితే సెట్స్ మీదకి వెళ్లలేదు. ఇక ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
సలార్ 2 షూటింగ్ ఆగష్టు 10 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని.. దీనికోసం భారీ సెట్ వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మరోవైపు ప్రభాస్ లేకుండా వచ్చే సన్నివేశాలను ఇప్పటికే 20 శాతం మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంది. ఇప్పటికే 600 కోట్లు వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్లో చేరనుంది.
ఇవి కూడా చదవండి..
-
Coolie | పాపులర్ టెక్నీషియన్‌తో లోకేశ్ కనగరాజ్.. రజినీకాంత్ కూలీ తాజా వార్త ఇదే
-
Telangana | తలలో పెన్ను గుచ్చుకుని.. నాలుగేళ్ల బాలిక మృతి
-
Bridge Collapses | బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 15 రోజుల్లో ఆరో ఘటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

