Sakshi Vaidya | ఏజెంట్ ప్రేయసిగా మెప్పిస్తా
‘ఏజెంట్' చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది సాక్షివైద్య. తొలి చిత్రం ద్వారానే పర్ఫార్మెన్స్కు ప్రాధాన్యం కలిగిన పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది.
‘ఏజెంట్’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది సాక్షివైద్య. తొలి చిత్రం ద్వారానే పర్ఫార్మెన్స్కు ప్రాధాన్యం కలిగిన పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది. అక్కినేని అఖిల్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సాక్షివైద్య మాట్లాడుతూ ‘నా స్వస్థలం ముంబయి. లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉండలేక కొన్ని రీల్స్ చేశాను. అవి చాలా పాపులర్ అయ్యాయి.
ఫ్రెండ్స్ సలహాతో ముంబయిలో కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. అయితే బాలీవుడ్లో వచ్చిన అవకాశాలు నచ్చక అంగీకరించలేదు. ‘ఏజెంట్’ కథ చాలా కొత్తగా అనిపించడంతో వెంటనే ఒప్పుకున్నా. ‘ఏజెంట్’ యాక్షన్ థ్రిల్లర్ అయినా అందమైన ప్రేమకథ ఉంటుంది. ఇందులో నేను ఏజెంట్ ప్రేయసిగా నటించా. ఆయన ఆపరేషన్‌లో పాలుపంచుకంటూ నా పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. నేను భరతనాట్య నేపథ్యం నుంచి రావడం వల్ల డ్యాన్స్ కోసం అంతగా కష్టపడలేదు. అఖిల్ చాలా మృదుస్వభావి. సహనటులకు చాలా మర్యాదనిస్తారు. ఆయన ద్వారా తెలుగు మాట్లాడటం నేర్చుకున్నా. తెలుగులో మరిన్ని మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా. వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా కన్ఫర్మ్ అయింది’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

