వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని తాను వేరుగా చూస్తానని చెప్పింది అగ్ర కథానాయిక సాయిపల్లవి. సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దక్షిణాదిలో విలక్షణ నాయికగా గుర్తింపును సంపాదించుకుందీ భామ. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ ‘సెట్స్‌లోకి అడుగుపెట్టినప్పుడు మాత్రమే సినిమా గురించి ఆలోచిస్తా. షూటింగ్ ముగిసి ఇంటికి వెళ్లిన తర్వాత సినిమా తాలూకు ఎలాంటి ఆలోచనలను మనసులోకి రానివ్వను. ఇక సెట్లో ఉన్నప్పుడు నా పర్సనల్ లైఫ్ గురించి అస్సలు ఆలోచించను. అలా ఉండగలిగితేనే మనఃశాంతి ఉంటుంది. మన వృత్తిలో పర్ఫెక్షన్ ప్రదర్శించడంతో పాటు వ్యక్తిగత జీవితంలో హ్యాపీగా ఉంటాం. అదే నా సక్సెస్ సీక్రెట్’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో శివకార్తికేయన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నది.