నాగచైతన్య మంచి స్పీడ్‌మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సాయిపల్లవి కథానాయికగా నటించనున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఇదిలావుంటే ఈ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాకు చైతూ పచ్చజెండా ఊపేశాడు.
తనకు ‘మజిలీ’ లాంటి విజయాన్ని ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ వారు నిర్మించనున్నట్టు తెలుస్తున్నది. ‘మజిలీ’ మాదిరిగా పెయిన్ఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉండబోతున్నదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంకా మిగతా వివరాలు తెలియాల్సివుంది.