తండ్రీకొడుకుల బంధంతో

కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎస్ఆర్కల్యాణమండపం’. ప్రమోద్, రాజు నిర్మిస్తున్నారు. శ్రీధర్ గాదే దర్శకుడు. బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు సాయికుమార్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “పోలీస్‌స్టోరీ’, ‘ప్రస్థానం’ చిత్రాలు నా సినీ జీవితాన్ని మలుపుతిప్పి నటుడిగా నాకు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ స్థాయిలో నాకు పేరుతెచ్చిపెట్టే సినిమా ఇది. తండ్రీకొడుకుల అనుబంధంతో వినోదం, సెంటిమెంట్ కలబోతగా ఉంటుంది’ అని అన్నారు. ‘కుటుంబ సమేతంగా చూసే చిత్రమిది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఓ పెళ్లిమండపం నేపథ్యంలో సాగుతుంది. తండ్రి గొప్పతనాన్ని ఓ కొడుకు ఎలా గుర్తించాడు? తండ్రి కలను అతడు ఏ విధంగా సాకారం చేశాడనే పాయింట్‌తో హృద్యంగా ఉంటుంది. సాయికుమార్ పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. ఆగస్ట్ 6న థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదలచేస్తున్నాం’ అని కిరణ్ అబ్బవరం తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

