రిపబ్లిక్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పాజిటివ్ టాక్ వచ్చినా వర్కవుట్ అవ్వలే..

Sai dharam tej Republic movie collections | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలైంది. దీనికి డీసెంట్ టాక్ వచ్చింది. సినిమా చాలా బాగా తీశాడు దేవా కట్టా అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎలాంటి పక్కదారి పట్టకుండా అనుకున్న కథను చాలా బాగా తెరకెక్కించాడు.. అంటూ ఆయనను మెచ్చుకుంటున్నారు సినిమా లవర్స్. కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే రిపబ్లిక్ సినిమాకు తొలి రోజు కనీసం రెండు కోట్ల షేర్ కూడా రాలేదు. సాయి ధరమ్ తేజ్ గత సినిమాలతో పోలిస్తే రిపబ్లిక్ చాలా తక్కువ వసూలు చేసింది. సినిమాకు టాక్ బాగానే వచ్చినా కూడా చివర్లో నెగిటివ్ ఎండింగ్ ఇవ్వడంతో.. ఆ ఇంపాక్ట్ సినిమాపై పడింది. అప్పటి వరకు సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్ లో హీరో చచ్చిపోయేసరికి.. ప్రేక్షకులు ఒక రకమైన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తో బయటికి వచ్చారు. అరె హీరో చచ్చిపోవడం ఏంటి అంటూ పెదవి విరిచినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించినా కూడా నెగిటివ్ క్లైమాక్స్ కలెక్షన్స్ పై దారుణమైన ప్రభావం చూపిస్తుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే సినిమా కేవలం ప్రశంశలు మాత్రమే మిగిలి.. కమర్షియల్ గా విజయానికి దూరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. రిపబ్లిక్ మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఇప్పుడు బయటికి వచ్చాయి..
నైజాం: 1.39 కోట్లు
సీడెడ్: 0.87 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.61 కోట్లు
ఈస్ట్: 0.33 కోట్లు
వెస్ట్: 0.32 కోట్లు
గుంటూరు: 0.37 కోట్లు
కృష్ణా: 0.32 కోట్లు
నెల్లూరు: 0.24 కోట్లు
ఏపీ + తెలంగాణ: 4.45 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + కర్ణాటక: 0.24 కోట్లు
ఓవర్సీస్: 038 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 5.07 కోట్లు షేర్
ఈ సినిమాకు రూ.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు 5 కోట్లు మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. అంటే మరో 7 కోట్ల దూరంలో నిలిచింది ఈ చిత్రం. టాక్ బాగానే ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. మరీ ముఖ్యంగా నెగిటివ్ క్లైమాక్స్ సినిమాపై అంచనాలు తారుమారు చేసింది. మరి చూడాలిక.. చివరి వరకు రిపబ్లిక్ ఎలా ఉండబోతుందో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai dharam tej | హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్.. ఆనందంలో ఫ్యాన్స్..
Gangavva: చిరంజీవికి తల్లిగా గంగవ్వ.. ఏ చిత్రంలోనో తెలుసా?
రిపబ్లిక్ సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్
Maa elections | మా ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు : పేర్ని నాని
Ram Potineni | హీరో రామ్ పోతినేనికి గాయం
నా భర్త అలాంటి వాడే.. రాజీవ్ కనకాలపై సుమ కీలక వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

