రెండు సినిమాలకు కమిటైన సాయి ధరమ్ తేజ్.. షూటింగ్ ఎప్పుడో..?

Sai dharam tej next movie | యాక్సిడెంట్ తర్వాత ఇప్పటి వరకు మహా అయితే ఒకసారి మాత్రం బయటకు వచ్చాడు సాయి ధరమ్ తేజ్. అభిమానులకు ఆయన కనిపించింది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే. దీపావళి సందర్భంగా తేజూ ఫోటో చిరంజీవితో పాటు మిగిలిన మెగా హీరోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ప్రమాదం తర్వాత సన్నబడిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మునపటిలా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. అలాగే.. మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్నాడు.
రిపబ్లిక్ సినిమా ఈవెంట్ సమయంలో కూడా ఆయన కోమాలోనే ఉన్నాడు. ఆ సినిమా విడుదలైన విషయం కూడా ఆయనకు తెలియదు. అయితే అది ఓటీటీలో విడుదలవుతున్న సమయంలో మాత్రం సినిమాకు ప్రమోషన్ చేశాడు సాయి తేజ్. విడుదల సమయంలో మీతో కలిసి చూడలేకపోయాను.. ఇప్పుడు రిపబ్లిక్ సినిమా చూసి మీ అభిప్రాయాలు నాకు చెప్పండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అలాగే తనపై చూపించిన ప్రేమకు, అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ట్వీట్ చేశాడు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడింది. మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిన సాయి ఆరోగ్యం విషయంలో ఎలాంటి అశ్రద్ధ తీసుకోవడం లేదు. మరికొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండబోతున్నాడు ఈయన. మరోవైపు తర్వాత సినిమాల గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాడు మెగా మేనల్లుడు.
ప్రస్తుతానికి సాయి ధరమ్ తేజ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. రిపబ్లిక్ తర్వాత రెండు మూడు సినిమాలు అనుకున్నాడు. కానీ అంతలోనే రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇప్పుడు కోలుకున్న తర్వాత మళ్లీ కెరీర్ పరంగా బిజీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే కార్తీక్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఒక సినిమా చేయబోతున్నాడు సాయి తేజ్. దీనిపై త్వరలోనే అధికారిక సమాచారం రానుందని తెలుస్తోంది. అంతేకాదు తన బావ, వరుణ్ తేజ్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని సాయి ధరమ్ తేజ్ భావిస్తున్నాడు. దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధం అయిపోయిందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలతోనే సాయి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. యాక్సిడెంట్ తర్వాత బాగా బరువు తగ్గిపోయి సన్నగా మారిపోయాడు మెగా మేనల్లుడు. ఈయన మళ్లీ మునపటిలా మారడానికి మరి కొన్ని రోజుల సమయం పట్టడం ఖాయం. ఎలా చూసుకున్నా కూడా 2022 ఫిబ్రవరి తర్వాత ఈ సుప్రీమ్ హీరో మళ్లీ కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఫిజిక్‌పై ఫోకస్ చేసిన సాయి ధరమ్ తేజ్.. షూటింగ్‌కు వచ్చేదప్పుడే..!
దర్శకుడు క్రిష్‌కు తీపికబురు చెప్పిన పవన్ కళ్యాణ్..
నా సినిమాను ఉచితంగా ఆడిస్తా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్
పవన్‌కల్యాణ్ కన్ఫ్య్జన్ మాస్టర్ : అంబటి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

