Sachin A Billion Dreams | ఆహాలోకి సచిన్ బయోపిక్: తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’!
Sachin A Billion Dreams | క్రికెట్ దేవుడు, లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ డాక్యుమెంటరీ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' (Sachin: A Billion Dreams) ఎట్టకేలకు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది.
Sachin A Billion Dreams | క్రికెట్ దేవుడు, లెజెండ్ సచిన్ టెండూల్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ డాక్యుమెంటరీ ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ (Sachin: A Billion Dreams) ఎట్టకేలకు తెలుగు ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ‘ఆహా’ (Aha) ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు మే 28 నుంచే డిజిటల్ స్ట్రీమింగ్‌ను అధికారికంగా ప్రారంభించింది. తెలుగు వెర్షన్‌తో పాటు మే 29 నుంచి ఈ చిత్రం తమిళంలోనూ అందుబాటులోకి రానుంది. జేమ్స్ ఎర్స్కైన్ దర్శకత్వంలో, రవి భాగ్‌చంద్క, కార్నివాల్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
2017లో థియేటర్లలో విడుదలై అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ డాక్యుమెంటరీ, సచిన్ టెండూల్కర్ అద్భుత క్రీడా ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సచిన్ చిన్ననాటి హోమ్ వీడియోలు, ఎక్కడా చూడని అరుదైన మ్యాచ్ ఫుటేజ్‌లతో పాటు ఆయన భార్య అంజలి, సోదరుడు అజిత్ టెండూల్కర్ పంచుకున్న అనేక ఎమోషనల్ విషయాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాగే ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ వంటి స్టార్ క్రికెటర్లు కూడా ఇందులో కనిపించి సచిన్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 1983లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు 10 ఏళ్ల సచిన్ పొందిన స్ఫూర్తి నుంచి, 2011లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించిన అద్భుత క్షణాలు, మైదానంలో సచిన్ ఇచ్చిన వీడ్కోలు ప్రసంగం (Farewell Speech) వరకు అన్ని చారిత్రాత్మక ఘట్టాలను ఇందులో చూడవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

