Jigarthanda-2 Movie | ‘జిగార్తండ-2’లో విలన్‌గా స్టార్ డైరెక్టర్?
Jigarthanda-2 Viilain | కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'జిగార్తండ' ఎంత పెద్ద విజయం సాధించిందో అందిరికి తెలిసిందే. దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.
Jigarthanda-2 Viilain | ‘పిజ్జా’, ‘జిగర్తాండ’, ‘పేట’, ‘మహాన్’ వంటి చిత్రాలతో తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్. డెబ్యూ సినిమాతోనే తమిళ పరిశ్రమను ఒక్క సారిగా తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఇక ఈయన సినిమాల్లో జిగార్తండ చాలా మంది ఫేవరెట్. సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాబి సింహా ముఖ్య పాత్రలో నటించాడు. 2014లో విడుదలైన ఈ చిత్రం తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమర్షియల్‌గా ఈ చిత్రం భారీ విజయం సాధించక పోయినా విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేష్’ టైటిల్‌తో రీమేక్ చేశాడు. 8ఏళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నట్లు కార్తిక్ సుబ్బరాజు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
జిగార్తాండ-2లో హీరోగా రాఘవ లారెన్స్ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జే సూర్య ఓ కీలకపాత్రలో నటించనున్నాడట. ఈయన పాత్ర నెగెటీవ్ షేడ్స్‌లో ఉండనుందట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయని సమాచారం. త్వరలోనే దీనికిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం స్క్రీప్ట్ పనులు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుందట.
Read Also:
Dasara Movie | భారీ ధరకు నాని ‘దసరా’ థియేట్రికల్ రైట్స్?
Cobra Movie | ఓటీటీలోకి ‘కోబ్రా’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Raviteja | రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరణ్?
Ponniyin Selvan | ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్యరాయ్ విలన్‌గా నటిస్తుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలి కార్మికుడు మృతి.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

