రవన్న దావత్ ఇస్తుండు..
జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లడం రవితేజ ైస్టెల్. ఆయన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే 75వ చిత్రానికి రంగం సిద్ధమైంది.
జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్లడం రవితేజ ైస్టెల్. ఆయన కెరీర్లో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే 75వ చిత్రానికి రంగం సిద్ధమైంది. రచయిత భాను భోగవరపుని దర్శకునిగా పరిచయం చేస్తూ, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్ని ఉగాది సందర్భంగా విడుదల చేశారు. ఓ జాతరను ఎస్టాబ్లిష్ చేస్తూ సృజనాత్మకంగా ఈ పోస్టర్ని మేకర్స్ డిజైన్ చేశారు. ఇది రవితేజ 75వ చిత్రం అని తెలిపే విధంగా ఈ పోస్టర్లో కళ్లద్దాలపై ‘ఆర్టీ 75’ అని రాయడం విశేషం. అలాగే తెలంగాణ మాండలీకంలో ‘రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి.. హ్యాపీ ఉగాది రా బయ్’ అని రాసి ఉండటం గమనార్హం. పోస్టర్ పోకడను బట్టి ఇది తెలంగాణ నేపథ్యంతో కూడిన సినిమా అని తెలుస్తున్నది.
ఇందులో రవితేజ పాత్ర పేరు ‘లక్ష్మణ్ భేరి’. ఆ కేరక్టరైజేషన్ని ఉగాది పంచాంగం రూపంలో పోస్టర్ ద్వారా చెబుతూ.. ‘ఆదాయం.. చెప్పను తియ్. ఖర్చు.. లెక్క జెయ్యన్. రాజ్యపూజ్యం.. అన్ లిమిటెడ్. అవమానం.. జీరో’ అంటూ రవితేజ ైస్టెల్లో చెప్పిన తీరు బావుంది. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: నవీన్ నూలి, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

