RT 69: రవితేజ తదుపరి సినిమా షూటింగ్‌పై ప్రకటన

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన రవితేజ తనదైన శైలి స్టైల్స్‌తో పాటు అదిరిపోయే యాక్టింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు . ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘క్రాక్’తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే మాస్ మహారాజ రవితేజ మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు.
‘క్రాక్’ విజయంతో ఉత్సాహంగా ఉన్న మాస్ మహారాజా.. ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన చేయనున్నారు. ప్రస్తుతం శరత్ మందవా అనే దర్శకుడితో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రాన్ని మొదలెట్టాడు. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కినకు చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలువుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ కొద్ది సేపటి క్రితం క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.అక్టోబర్ 4 నుండి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని తెలియజేశారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

