RRR Promotions Road map | 9 పట్టణాల్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్..రోడ్ మ్యాప్ వీడియో
మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది ఆర్ఆర్ఆర్ (RRR). ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది జక్కన్న టీం. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 2022 మార్చి 19న కర్ణాటకలో నిర్వహించనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు.
మరో వారం రోజుల్లో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ (RRR) రాబోతుంది. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది జక్కన్న టీం. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 2022 మార్చి 19న కర్ణాటకలో నిర్వహించనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. ఇక రేపటి నుంచి అనగా మార్చి 18 నుంచి ఆర్ఆర్ఆర్ టీం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో అభిమానుల్లో జోష్ నింపేందుకు రెడీ అవుతోంది.
ప్రమోషనల్ ఈవెంట్ హైదరాబాద్ (Hyderabad)లో షురూ..హైదరాబాద్‌లోనే ముగించేలా ప్లాన్ చేసింది జక్కన్న టీం.
తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 18న హైదరాబాద్-దుబాయ్, మార్చి 19న బెంగళూరు, మార్చి 20న బరోడా-ఢిల్లీ, మార్చి 21న అమృత్ సర్-జైపూర్, మార్చి 22న కోల్‌కతా-వారణాసి, మార్చి 23-హైదరాబాద్ ప్రాంతాల్లో ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
Gear up for a thunderous and exciting week of promotions💥
Come join our MaRRRch… 🙌🏻🤞🏻#RRRTakeOver #RRRMovie pic.twitter.com/ZSxYFinuwh
— RRR Movie (@RRRMovie) March 17, 2022
మూవీ లవర్స్ కు క్లారిటీ వచ్చేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాల రోడ్ మ్యాప్‌తో ఓ వీడియో కూడా రూపొందించగా..నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్లో రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రం భీమ్ రోల్లో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ యాక్టర్లు అజయ్ దేవ్గన్, అలియాభట్, శ్రియా శరణ్, హాలీవుడ్ భామ ఒలీవియా మొర్రీస్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

