బాహుబలి చిత్రంతో చరిత్ర సృష్టించిన రాజమౌళి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అక్టోబర్ 13న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించగా, ప్రస్తుత పరిస్థితుల వలన వాయిదా వేశారు.
“రౌద్రం రణం రుధిరం” సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొద్ది రోజులుగా సస్పెప్స్ నెలకొనగా, మేకర్స్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు.ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్ ఫోటలతో పోస్టర్ విడుదల చేసి మూవీని జనవరి 7,2022 న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో జనవరి 12న “భీమ్లా నాయక్”, 13న “సర్కారు వారి పాట”, 14న “రాధేశ్యామ్” రానున్నాయి. ఈ సినిమాల విడుదలకు ముందు కనీసం వారం కూడా గ్యాప్ లేకుండానే “ఆర్ఆర్ఆర్” విడుదల అవుతుంది. అంటే సంక్రాంతికి బడా ఫైట్ తప్పేలా లేదు.