Rocky aur Rani ki prem kahani | రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ టీజర్ రిలీజ్.. ఇది కదా అసలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే..!
Rocky aur Rani ki prem kahani Movie | హిందీ చిత్రసీమలో ప్రేమకథలకు కేరాఫ్ అడ్రెస్‌గా కరణ్ జోహర్‌ను చెప్పుకుంటుంటారు. తీసింది కొన్ని సినిమాలే అయినా.. అన్ని బంపర్ హిట్లే. ఆయన నుంచి సినిమా వస్తుందే అది పక్కా బ్లాక్‌బస్టర్ హిట్టే అనే విధంగా బాలీవుడ్ ప్రేక్షకులు భావిస్తుంటారు.
Rocky aur Rani ki prem kahani Movie | హిందీ చిత్రసీమలో ప్రేమకథలకు కేరాఫ్ అడ్రెస్‌గా కరణ్ జోహర్‌ను చెప్పుకుంటుంటారు. తీసింది కొన్ని సినిమాలే అయినా.. అన్ని బంపర్ హిట్లే. ఆయన నుంచి సినిమా వస్తుందే అది పక్కా బ్లాక్‌బస్టర్ హిట్టే అనే విధంగా బాలీవుడ్ ప్రేక్షకులు భావిస్తుంటారు. ఇక గతకొంత కాలంగా కరణ్ అమావాస్యకో సినిమా అన్నట్లు అడపా దడపాగా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. ఏడేళ్ల తర్వాత కరణ్ రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమా కోసం మెగాఫోన్ పట్టాడు. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఒక్క డైలాగ్ లేకుండా సంగీతంతోనే టీజర్‌ను నింపేశారు. కరణ్ తన స్టైల్ ఆఫ్ కామెడీని, ఎమోషన్స్‌ను పుష్కలంగా దట్టించినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. ప్రేమ, భావోద్వేగం, సంఘర్షణ వంటి మూడింటి కలయికలో ఈ సినిమా రూపొందింది. కుటుంబ కథా నేపథ్యంలో మంచి ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ధర్మేంద్రా, జయా బచ్చన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరణ్ జోహార్ ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. వయాకామ్18 స్టూడీయోస్‌తో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను రూపొందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anantapur School Attack | తరగతి గదిలో నెత్తురుటేరులు.. వెండితెరపై చూపిస్తున్న హింసే పిల్లల నేరాలకు బాటలు వేస్తోందా?
School Slab | డిప్యూటీ సీఎం భట్టి ఇలాఖాలో ఊడిపడ్డ స్కూల్ స్లాబ్ పెచ్చులు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

