Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని కోలీవుడ్ హీరోయిన్ ‘గురు’ సినిమా ఫేమ్ రితికా సింగ్ అన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్’(Vettayan). తెలుగులో వేటగాడు అని వస్తున్న ఈ సినిమాకు జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రితికా సింగ్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సందర్భంగా రజనీకి రితికా ధన్యవాదాలు తెలిపింది. రజనీకి ఉన్న దయాగుణం, ప్రేమ సాటిలేనివని.. అంతటి గొప్ప వ్యక్తితో తాను కలిసి పనిచేయడం అనేది జీవితంలో మరచిపోలేని ఒక సంఘటన అని రితికా వెల్లడించింది.
ఇక 75% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభంకాగా.. ఈ షూటింగ్లో పాల్గోనడానికి రజినీకాంత్ కూడా చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, దుషారా విజయన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read