తమన్నా ప్లాన్స్ ఏమిటి?

బాలీవుడ్లో చక్కటి అవకాశాల్ని అందుకుంటున్నా మిల్కీబ్యూటీ తమన్నాకు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. అక్షయ్‌కుమార్, అజయ్‌దేవ్‌గణ్ వంటి అగ్రహీరోలతో హిందీలో సినిమాలు చేసినా తమన్నా విజయాల్ని మాత్రం అందుకోలేదు. తాజాగా దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ చిత్రంతో బాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తోంది తమన్నా. రితేష్ దేశ్‌ముఖ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంకఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వివాహమనేది తనకు తప్ప అందరికీ అవసరమని విశ్వసించే మ్యారేజ్‌బ్యూరో అధినేతగా తమన్నా ఈ సినిమాలో కనిపించబోతున్నది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆమె కనిపిస్తుందని దర్శకుడు చెబుతున్నారు. ఈ సినిమాతో రితేష్ దేశ్‌ముఖ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ చిత్రం విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

