గత ఏడాది దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకుంది ‘కాంతార’ చిత్రం. దైవిక అంశాలు, అడవి బిడ్డల అస్తిత్వం అంశాల కలబోతగా అన్ని వర్గాల వారిని మెప్పించింది. ఈ సినిమా సీక్వెల్ గురించి గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ధృవీకరించింది. తాజా ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ..“కాంతార’ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ మొదలైంది.
జూన్‌లో చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకొస్తాం. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు వర్షాకాలం నేపథ్యంలో ఉంటాయి. అందుకే జాన్‌లో నెలలో షూటింగ్ ఆరంభిస్తాం. ‘కాంతార’కు ఇది సీక్వెల్ కాదు ప్రీక్వెల్’ అని తెలిపారు.