నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రం రూపొందుతుంది. 1970స్ కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫుల్ లిరికల్ సాంగ్ వీడియోని రేపు (నవంబర్ 6) శనివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గూస్ బమ్స్ అలర్ట్ అంటూ ఓ లిటిల్ సర్ప్రైజ్ వీడియోని వదిలారు. బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ ఈ పాటను మాంచి జోష్తో పాడుతూ కనిపించారు.
నాని మీసం తిప్పుతూ ఎవరికో వార్నింగ్ ఇస్తుండటం.. కాలు మీద కాలేసుకుని సిగరెట్ తాగడం వంటివి మానిటర్ లో కనిపిస్తున్నాయి. ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. శ్యామ్ సింగ రాయ్ ఒక లెజెండ్ గా ఎలా మారాడో ఈ పాట వివరిస్తుంది. నాలుగు దక్షిణాది భాషల్లోనూ విశాలే ఈ పాట పాడటం విశేషం. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి కూడా దీనికి గొంతు కలిపారు. మిక్కీ జె మేయర్ ఈ పాటకు తన స్టైల్ కు భిన్నమైన ట్యూన్ కంపోజ్ చేశారు. తెలుగు వెర్సన్ కు కృష్ణ కాంత్(కె.కె) సాహిత్యం అందించారు.నాని సరసన సాయి పల్లవి , కృతి శెట్టి , మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.