RGV | దేవుడికి నాస్తికులే ఇష్టం.. రాజమౌళి వివాదంపై స్పందించిన ఆర్జీవీ.. సనాతన ధర్మ పరిరక్షకులకు కౌంటర్!
SS rajamouli | భారతీయ చలనచిత్ర దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇటీవల తాను దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.
RGV | దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇటీవల తాను దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ సినిమా ఈవెంట్లో ఆయన చేసిన ఈ కామెంట్స్‌పై పలు హిందూ సంఘాలు, బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాజమౌళికి మద్దతుగా నిలడడమే కాకుండా విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్టు పెట్టారు.
”రాజమౌళిపై విషం కక్కుతున్న సోకాల్డ్ ధర్మ రక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే… భారతదేశంలో నాస్తికుడిగా (Atheist) ఉండటం నేరం కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 దేవుడిని విశ్వసించకపోవడాన్ని కూడా రక్షిస్తుంది. అందుకే, మీరు దేవుడిని నమ్ముతున్నామని చెప్పే హక్కు మీకు ఎంత ఉందో, రాజమౌళికి కూడా తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు అంతే ఉంది. అయితే రాజమౌళి దేవుడిని నమ్మకపోతే తన సినిమాల్లో దేవుడిని ఎందుకు చూపిస్తున్నాడు? అనేది మూర్ఖపు వాదన. ఆ లెక్కన, గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్‌స్టర్‌గా మారాలా? హారర్ సినిమా కోసం దెయ్యంగా మారాలా? అని ఆర్జీవీ విమర్శకులను ప్రశ్నించారు.
నిజం చెప్పాలంటే… రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా చాలా మంది దేవుడిని నమ్మేవారు కూడా తమ జీవితాల్లో చూడనంత విజయం, సంపద నాస్తికుడైన రాజమౌళికి ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే దేవుడు నాస్తికులనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, లేదా దేవుడు అసలు జనాలను పట్టించుకోడేమో? లేదంటే ఎవరు నమ్ముతున్నారని లెక్కలు రాసుకునే నోట్‌ప్యాడ్ పట్టుకొని దేవుడు కూర్చోలేదేమో? అని ఆర్జీవీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రాజమౌళితో దేవుడికే సమస్య లేనప్పుడు, ఈ స్వయం ప్రకటిత ధర్మ రక్షకులైనవారు (God Mongers) ఎందుకు బీపీ, అల్సర్ తెచ్చుకుంటున్నారు? నిజమైన సమస్య ఆయన నాస్తికత్వం కాదు. దేవుడిని నమ్మకుండానే ఆయన విజయం సాధించడమే అసలు సమస్య. ఎందుకంటే దేవుడిని పిచ్చిగా ప్రార్థించినా విజయం సాధించలేని వారిని ఇది భయపెడుతోంది అని ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశ్వాసులు దేవుడిని రక్షించడం మానేయాలి. అది దేవుడిని అవమానించినట్లే. రాజమౌళి నాస్తికుడైనంత మాత్రాన దేవుడి శక్తి తగ్గదు. నమ్మకం ఆగిపోయిన వెంటనే విశ్వాసం కూలిపోతుందని భావించే వారి ఇన్ సెక్యురిటీ మాత్రమే పెరుగుతుంది అని ఆర్జీవీ అన్నారు.
చివరిగా.. దేవుడు బాగానే ఉన్నాడు. రాజమౌళి బాగానే ఉన్నాడు. వీరిద్దరినీ అర్థం చేసుకోలేని వారు మాత్రమే బాధపడుతున్నారు. రాజమౌళి తదుపరి చిత్రం ‘వారణాసి’ ద్వారా దేవుడు ఆయన బ్యాంకు బ్యాలెన్స్‌ను మరింత పెంచుతాడు. దేవుడి నమ్మకం పేరుతో అసూయ పడుతున్న వాళ్లు ఏడుస్తూ కూర్చోవడమే. జై హనుమాన్ అంటూ” ఆర్జీవీ తన వ్యాఖ్యలను ముగించారు.
In the context of all the venom being spewed by the so called believers on @ssrajamouli they should know that being an atheist in India is not a crime . Article 25 of the Constitution protects the right to not believe
So he has every right to say he doesn’t believe as much as the…— Ram Gopal Varma (@RGVzoomin) November 21, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

