Republic Review | రిపబ్లిక్ సినిమాలో చెప్పాలనుకున్న కంటెంట్ పబ్లిక్కు రీచ్ అయిందా..?

Republic Movie Review | ఒక బలమైన కథ చెప్పాలంటే బలమైన కథానాయకుడు కావాలి. దర్శకుడు కూడా తాను చెప్పాలనుకున్న పాయింట్ పక్కదారి పట్టకుండా చెప్పగలగాలి. అప్పుడే ఆ కథకు న్యాయం జరుగుతుంది. కమర్షియల్ కోణంలో ఆలోచించి ఏ మాత్రం పక్కదారి పట్టినా రాసుకున్న కథకు న్యాయం చేయలేడు దర్శకుడు. ఈ విషయం దేవా కట్టా కు బాగా తెలుసు. ఈయన ఎలాంటి సినిమాలు తీస్తాడో ప్రేక్షకులకు తెలుసు. దాదాపు పదేళ్లుగా కెరీర్లో ఒక్క హిట్ కూడా లేదు. ఇలాంటి సమయంలో వరుస విజయాలతో జోరు మీదున్న సాయి ధరమ్ తేజ్ దేవా కట్టా ను నమ్మి అవకాశం ఇచ్చాడు. రిపబ్లిక్ కథ సాయి ధరమ్ తేజ్ కి బాగా నచ్చి చేశాడు. ఈ నమ్మకాన్ని దాదాపు నిలబెట్టుకున్నాడు దేవా కట్టా.
కమర్షియల్ కోణంలో ఆలోచించకుండా దర్శకుడికి కావాల్సిన ఫ్రీడం ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్ . దాని ఫలితం ఇప్పుడు రిపబ్లిక్ సినిమా రూపంలో కనిపిస్తుంది. కుళ్లు పట్టిన వ్యవస్థను ప్రశ్నించే సినిమా రిపబ్లిక్ అంటూ విశ్లేషకులు కూడా దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కమర్షియల్గా ఈ సినిమా సేఫ్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే కచ్చితంగా సాయి ధరమ్ తేజ్ కెరీర్లో మాత్రం రిపబ్లిక్ ఒక మంచి సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దర్శకుడు దేవా కట్టా కూడా తాను చెప్పాలనుకున్న కంటెంట్ సుత్తి లేకుండా సూటిగా చెప్పాడు. మనం ఎలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం అనేది ఒప్పుకోలేనంత పచ్చిగా చూపించాడు దేవా కట్టా.
ఈ క్రమంలోనే రిపబ్లిక్ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ దూరమయ్యాయి. అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తన కథను చెప్పాడు దేవా కట్టా. అయితే మరింత పకడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకొని ఉండుంటే కచ్చితంగా రిపబ్లిక్ మరింత మంచి సినిమా అయ్యుండేది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేశ్ క్యారెక్టర్స్ బలంగా అనిపించినా కథలో అంతర్లీనంగా బలంగా అనిపించలేదు. కొన్ని చోట్ల వాళ్ల పాత్రలు తేలిపోయాయి. ఓవరాల్గా రిపబ్లిక్ సినిమాతో దేవాకట్టా ఇవ్వాలనుకున్న మెసేజ్ సగం వరకే రీచ్ అయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Republic Movie Review | సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా రివ్యూ
Republic: అనేక ఛాలెంజెస్ నడుమ 64 రోజుల్లో రిపబ్లిక్ షూటింగ్ పూర్తి- మేకింగ్ వీడియో
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ప్రసంగంతో చిరంజీవి అప్ సెట్ అయ్యాడా..?
రిపబ్లిక్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన డైరెక్టర్
సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అభిమానుల్లో టెన్షన్.. అప్డేట్ ఇచ్చిన థమన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

