Pawan Kalyan Son | పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ఇదివరకే అకీరా ఎంట్రీపై చాలా కథనాలు వినిపించాయి. తాజాగా అకీరా తల్లి రేణు దేశాయ్, అకీరా ఎంట్రీ స్పందించారు. అకీరా వెండితెర ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు రేణు.
అందరిలానే నాకు కూడా అకీరా బిగ్ స్క్రీన్ పై చూడలని వుందని చెప్పుకొచ్చారు రేణు. ఇదే క్షణంలో అకీరాకి హీరో అవ్వాలనే ఆసక్తి ఇప్పరివరకూ రాలేదని చెప్పారు.” అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. తను పియానో, ఫిల్మ్ ప్రొడక్షన్, యోగా, మార్సల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు. తనకి రైటింగ్ ఇష్టం. ఒక స్క్రిప్ట్ కూడా రాశాడు. అయితే ఇప్పటివరకూ నటుడిని అవుతానని మాత్రం చెప్పలేదు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తా” అని చెప్పుకొచ్చారు రేణు.
రవితేజ టైగర్ నాగేశ్వరరావులో హేమలతా లవణం పాత్ర పోషించారు రేణు దేశాయ్. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.