Renu Desai | అకీరా నందన్‌కు హీరో అవ్వాలన్న ఆసక్తి లేదు.. పుకార్లపై రేణూ దేశాయ్
Renu Desai | దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (Raghavendra Rao) పవన్ కల్యాణ్ కుమారుడు (Pawan Kalyan Son) అకీరా నందన్ (Akira Nandan)తో కలిసి దిగిన స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తుందని తెలిసిందే.
Renu Desai | టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (Raghavendra Rao) పవన్ కల్యాణ్ కుమారుడు (Pawan Kalyan Son) అకీరా నందన్‌తో కలిసి దిగిన స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తుందని తెలిసిందే. రాఘవేంద్రరావు తన మనవడు కార్తికేయ, అకీరా నందన్ (Akira Nandan)ను యూఎస్ఏలోని ఫిల్మ్ స్కూల్లో ఇద్దరినీ జాయిన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇద్దరితో కలిసి ఫొటో కూడా దిగారు.
రాఘవేంద్రరావు ఇచ్చిన అప్డేట్తో ఇక త్వరలోనే అకీరా నందన్ హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నాడని తెగ చర్చించుకోవడం మొదలుపెట్టారు పవర్ స్టార్ అభిమానులు.
ఈ వార్తలపై అకీరా నందన్ తల్లి రేణు దేశాయ్ (Renu Desai) స్పందిస్తూ.. ప్రస్తుతానికి అకీరా నందన్‌కు నటనలో కానీ లేదా హీరో అవుదామని కాని ఆసక్తి లేదు. భవిష్యత్‌ను అంచనా వేయలేను. నా ఇన్‌స్ట్రాగ్రామ్ పోస్ట్ పెట్టిన ప్రతీసారి చేస్తున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టండి. ఒకవేళ అకీరా నందన్ యాక్టింగ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటే.. ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకునే మొదటి వ్యక్తిని నేనే అంటూ చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.
ఇదిలా ఉంటే అభిమానులు మాత్రం అకీరా నందన్‌కు మాత్రం యాక్టింగ్‌పై ఆసక్తి ఉందని, సరైన టైంలో ఇండస్ట్రీ ఇవ్వడం ఖాయమని నమ్ముతున్నారు. మరి అకీరా నందన్ ఎంట్రీ పై కాలమే చెబుతుందని అంటున్నారు సినీ జనాలు.

Renu Desai1
ఫిల్మ్ స్కూల్ వద్ద అకీరానందన్‌తో ఇలా..
Latest pics of smart looking #PawanKalyan son #AkiraNandan. pic.twitter.com/vDOePCAUGS
— Manobala Vijayabalan (@ManobalaV) August 21, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

