Jaat Movie | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీడియోల్ (Sunny Deol) హీరోగా నటిస్తోన్న చిత్రం జాట్ (Jaat). టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్డీజీఎం (SDGM)గా రాబోతున్న ఈ చిత్రానని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రెజీనాకు శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ఆకుపచ్చ ఫ్లోరల్ డిజైన్ చీరలో చిరునవ్వులు చిందిస్తున్న రెజీనాలుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ లాంచ్ చేసిన టీజర్ స్టన్నింగ్ యాక్షన్ పార్ట్‌తో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ సినిమాకు రిషి పంజాబి సినిమాటోగ్రాఫర్ కాగా.. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని బీటౌన్ డెబ్యూ ఇస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
Team #JAAT wishes the ever-alluring @ReginaCassandra a very Happy Birthday ❤🔥 pic.twitter.com/vshju2iZs7
— BA Raju’s Team (@baraju_SuperHit) December 13, 2024
Mohan Babu | కాసేపట్లో మోహన్ బాబు ఇంటికి పోలీసులు..స్టేట్మెంట్ రికార్డ్..!
Singham Again | ట్విస్ట్‌తో అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ ఓటీటీ ఎంట్రీ
Daaku First Single | డేగ డేగ డేగ.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న బాలకృష్ణ డాకు మహారాజ్ సాంగ్ ప్రోమో