టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan), స్టార్ డైరెక్టర్ (Shankar) దర్శకత్వంలో ఆర్సీ 15 (RC15) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. పొలిటికల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆర్సీ 15కు సర్కారోడు, అధికారి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా వీటిలో శంకర్, రాంచరణ్ టీం అధికారి పేరును లాక్ చేసిందట.
త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందని సమాచారం. దిల్ రాజు నుంచి టైటిల్‌పై గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటన ఉండబోతుందని తాజా టాక్. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీకాంత్, సునీల్, అంజలి, కన్నడ యాక్టర్ జయరామ్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా..సాయిమాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తున్నారు.
Read Also : Pooja Hegde | కరణ్ జోహార్ టీంతో జాయిన్ అయిన పూజాహెగ్డే..వీడియో
Read Also : DJ Tillu Sequel | సీక్వెల్‌తో వచ్చేస్తున్న డీజే టిల్లు..ఆ ఫ్లేవర్ రిపీట్ అయ్యేనా..?
Read Also : Shahrukh Khan | రామోజీఫిలింసిటీలో షారుక్ ఖాన్..జోష్‌లో అభిమానులు
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్