ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా నటిస్తున్న సినిమా ‘టాప్ గేర్’. ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు కె. శశికాంత్ రూపొందించారు. ఈ నెల 30న సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్ర ట్రైలర్ను హీరో రవితేజ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు కె. శశికాంత్ మాట్లాడుతూ…‘మా చిత్ర ట్రైలర్ను విడుదల చేసిన రవితేజకు థాంక్స్. యాక్షన్ థ్రిల్లర్ కథ అయినా ఇందులో లవ్, రొమాన్స్ వంటి అంశాలుంటాయి. కథలో వచ్చే మలుపులు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇందులో ఆది టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు. సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’ అన్నారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.