హృదయాన్ని తడిమే కుటుంబ భావోద్వేగాలు, తండ్రీకూతుళ్ల అనుబంధం, ఆధ్యాత్మిక అంశాలు కలబోతగా రూపొందుతున్న చిత్రం ‘ఇరుముడి’. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను ఈ నెల 3న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో రవితేజ తన కూతురితో ఓ కొండపై కూర్చుని కనిపిస్తున్నారు. తండ్రీకూతుళ్ల ప్రయాణం తాలూకు ప్రేమానురాగాలు, సంఘర్షణకు అద్దంపట్టేలా ఈ పోస్టర్ కథపై ఆసక్తిని పెంచుతున్నది. రవితేజను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిదని, ఇందులోని ఫ్యామిలీ ఎమోషన్స్ హృదయాన్ని కదిలిస్తాయని మేకర్స్ తెలిపారు. బేబీ నక్షత్ర, అజయ్‌ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.