బిగ్ బాస్ ట్రోఫీ సాధించాలనే కసితో ఇంట్లోకి అడుగుపెట్టిన రవికి ఊహించని నిరాశ ఎదురైంది. 12 వ వారం ఊహించని ట్విస్ట్ తో ఎలిమినేట్ అయ్యాడు రవి. అయితే అందరికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేసిన రవితో గేమ్ ఆడించాడు నాగార్జున. ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ అని చెప్పమంటూ ఓ టాస్క్ ఇచ్చాడు. నేను ఫెయిల్ అయ్యాను. అందుకే ఇక్కడ ఉన్నాను. నేనేం చెబుతాను సర్ అని రవి అనేశాడు.
నీ ఉద్దేశ్యంలో ఇంట్లో వాళ్లో ఎవరో చెప్పమని అన్నాడు నాగ్. దీంతో షన్ను, శ్రీరామచంద్ర, సన్నీలకు పాస్ అని ఇచ్చాడు. మిగతా వాళ్లకు మాత్రం ఫెయిల్ అని ఇచ్చాడు. షన్ను మెచ్యూరిటీకి మారు పేరు.. షన్నుతో కలిసి బిగ్ బాస్ జర్నీ చేసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను అని షన్ను గురించి ఎంతో గొప్పగా చెప్పాడు రవి. ఇక శ్రీరామచంద్రకు ఇంచు కూడా స్వార్థమన్నది ఉండదు.. జెమ్ ఆఫ్ పర్సన్.. అన్నీ పర్ఫెక్ట్. నువ్ లోపల ఆడు. నీ కోసం నేను బయట ఆడుతాను అని రవి అంటాడు.
రవి ఎలిమినేట్ అవ్వడం ఏంటి? అంతా ఆశ్చర్యంగా ఉంది అని శ్రీరామచంద్ర చెబుతూ షాక్ అయ్యాడు. అక్క, వియా, నీ కోసం, అంకుల్ ఆంటీ కోసం ఆట ఆడతాను అని శ్రీరామచంద్ర అంటాడు. ఇక సన్నీ తోపు సర్.. ఫ్రెండ్ అంటే చాలు ఏదైనా ఇస్తాడు.. ఎంత దూరమైన వస్తాడు.. అది చాలా మంచిది.. దాని వల్లే ఇక్కడి వరకు వచ్చాడు.. అది బయట కూడా పనికొస్తుంది అని రవి ప్రశంసించాడు. ఇక ప్రియాంక, కాజల్, మానస్, సిరిలను ఫెయిల్ అని చెప్పాడు.
ప్రియాంక గురించి చెబుతూ.. ఏం చేయాలో నీది నువ్వు తెలుసుకో.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వేస్ట్.. నువ్ ఫెయిల్ అవ్వకూడదని చెబుతున్నాను అని రవి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సిరి నా సిస్టర్ ఫెయిల్ అవ్వకూడదని చెబుతున్నా. దేనికీ భయపడకు.. దూసుకుపో.. ఎక్కువ ఆలోచించకు.. ఫెయిల్ అవ్వకూడదని ఇది చెబుతున్నా.. నా టాప్ 5లో నువ్వే ఫస్ట్ ఉంటావ్ అని రవి అన్నాడు. ఇక మానస్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్‌గా ఉంటాయని అన్నాడు. కాజల్ నీ బలం ఏంటో నీకే తెలుసు.. నువ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వొద్దు అని రవి అందరికీ గుడ్ బై చెప్పేశాడు.