Ravi Babu | నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా జర్నీ కొనసాగిస్తున్న రవిబాబు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. టాలీవుడ్లో ఉన్న మల్టీ టాలెంటెడ్ సీనియర్ యాక్టర్లలో ఒకరు రవి బాబు (Ravi Babu). లాంగ్ గ్యాప్ తర్వాత రవిబాబు డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
రవిబాబు స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ Razor. మేకర్స్ ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేశారు. అనౌన్స్మెంట్ వీడియోలో రవి బాబు యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయినట్టు ప్రకటించారు.
అంతేకాదు ఈ చిత్రాన్ని 2026 మేలో సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో రవిబాబు లీడ్ రోల్లో నటిస్తున్నాడు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. రవిబాబు చివరగా ఆర్పీ పట్నాయక్ డైరెక్షన్లో వచ్చిన కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో వన్ ఆఫ్ ది కీ రోల్లో నటించాడు. డైరెక్టర్‌గా 2021లో క్రష్ సినిమా తెరకెక్కించాడు.
And it’s a wrap for #Razor💥💥
Post production in progress.
Experience it in cinemas, May 2026.Razor – A Ravi Babu Film.
A Flying Frogs Production#RaviBabu @sureshprodns pic.twitter.com/bKR6vlSIoy— BA Raju’s Team (@baraju_SuperHit) February 10, 2026
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు.. సాయం చేయడానికి ఎవరూ లేరు.. నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన
NTR | జోర్డాన్‌లో ఎన్టీఆర్ దుమ్మురేపుతున్న ‘డ్రాగన్’ యాక్షన్… ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!
Epstein files | ఎప్స్టీన్తో విందులో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్.. ఫొటోలు విడుదల