Razor | టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రవి బాబు (Ravi Babu) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన చిత్రం Razor. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఇంప్రెస్ చేయలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది.
తక్కువ టైంలో థ్రియాట్రికల్ రన్ ముగించిన ఈ మూవీ ఇక ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకోనుంది. ఈ మూవీ పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో జూన్ 19 నుంచి ప్రీమియర్ కానుంది. మరి ఓటీటీలొ ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందో చూడాలి.
ఈ చిత్రంలో తనీష్ అల్లాడి, ఇనయ సుల్తానా, బేబి తేజాల్, విఖ్యాత్, బెనర్జీ, వీరన్న చౌదరి, రామరాజు కీలక పాత్రల్లో నటించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రవిబాబు, సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మించారు. రవిబాబు చివరగా ఆర్పీ పట్నాయక్ డైరెక్షన్లో వచ్చిన కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో వన్ ఆఫ్ ది కీ రోల్లో నటించాడు. డైరెక్టర్‌గా 2021లో క్రష్ సినిమా తెరకెక్కించాడు.
One CCTV footage. One little girl in danger. One man with a past darker than the truth itself.#Razor premieres June 19, only on #aha. pic.twitter.com/e89S0oVQn1
— Suresh PRO (@SureshPRO_) June 15, 2026