Rashmika | యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘#90’s’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. హైదరాబాద్‌లో జరిగిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె తన మరిది ఆనంద్ దేవరకొండతో పాటు సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ఎపిక్’ ట్రైలర్ తనకు చాలా బాగా నచ్చిందని రష్మిక తెలిపారు. ట్రైలర్ చూస్తుంటే ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగిందని ఆమె చెప్పారు.
తప్పకుండా థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూస్తానని రష్మిక వెల్లడించారు. ట్రైలర్లో కనిపించిన ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ తనను ఆకట్టుకున్నాయని చెప్పుకొచ్చారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి తాను ఎలా వచ్చానో కూడా రష్మిక సరదాగా వెల్లడించారు. ఆనంద్ స్వయంగా తనకు మెసేజ్ చేసి ట్రైలర్ లాంచ్‌కు రావాలని అడిగాడని చెప్పారు.ప్రస్తుతం తాను ‘రణబలి’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్నానని, అందుకే ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తానని ఆనంద్‌కు చెప్పినట్లు రష్మిక తెలిపారు.దీంతో ఆనంద్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న ఫ్యామిలీ బాండింగ్ మరోసారి ఈవెంట్లో హైలైట్ అయింది. ‘ఎపిక్’లో వైష్ణవి చైతన్య పోషించిన హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని రష్మిక చెప్పారు. కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని పేర్కొంటూ వైష్ణవి నటనను కూడా ప్రశంసించారు.
వైష్ణవి తన పాత్రలో అద్భుతంగా నటించి ఉంటుందని రష్మిక అన్నారు. దీంతో సినిమాలో వైష్ణవి పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి మరింత పెరిగింది. ఇక దర్శకుడు ఆదిత్య హాసన్‌పై రష్మిక చేసిన సరదా వ్యాఖ్యలు ఈవెంట్లో నవ్వులు పూయించాయి. ఆదిత్యను చూస్తే చాలా షైగా కనిపిస్తారని.. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం ఆయనలో ఆ షైనెస్ ఎక్కడా కనిపించలేదని రష్మిక అన్నారు.ముఖ్యంగా ట్రైలర్‌లోని రొమాంటిక్ సన్నివేశాలను ప్రస్తావిస్తూ ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు అందరినీ నవ్వించాయి. ట్రైలర్లో రొమాన్స్‌ను చూసిన తర్వాత ఆదిత్య హాసన్‌పై రష్మిక చేసిన ఈ కామెంట్స్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. హెషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. శివాజీ, వాసుకి కీలక పాత్రల్లో నటించారు