Rashmika Mandanna | అమ్మానాన్న నన్ను ఇంట్లో ఏమని పిలుస్తారో తెలుసా..? సీక్రెట్ చెప్పిన రష్మిక
రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కలిసి నటిస్తోన్న వారిసు సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
పుష్ప సినిమాతో జాతీయస్థాయిలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna) . ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కలిసి నటిస్తోన్న వారిసు సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
కాగా మరోవైపు బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి హిందీలో మిషన్ మజ్ను (Mission Majnu) చేస్తోంది. ఈ మూవీ జనవరి 20న నెట్ ఫ్లిక్స్ ప్రీమియర్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో తీరిక లేకుండా ఉంది రష్మిక. ఈ సందర్భంగా నెటిజన్లతో చిట్ చాట్ సెషన్లో పాల్గొన్నది రష్మిక. ఇంట్లో తనను అమ్మానాన్న ఏమని పిలుస్తారో చెప్పింది రష్మిక. తాను ఇంట్లో ఉన్నపుడు మోని లేదా మోవా అని అమ్మానాన్న పిలుస్తారని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ పేర్లకు అర్థమేంటనే కదా మీ డౌటు. కొడవ భాషలో కూతురు అని అర్థం.
ఇంకేముంది ఇప్పటివరకు నేషనల్ క్రష్‌గా ఉన్న రష్మికను.. తన ఫాలోవర్లలో ఉన్న సీనియర్ సిటిజన్లు రాబోయే రోజుల్లో ఈ సీక్రెట్ పేరుతో పిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు సినీ జనాలు. . సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 షూటింగ్లో కూడా రష్మిక జాయిన్ కావాల్సి ఉంది. త్వరలో రష్మిక షూటింగ్ అప్డేట్ ఇస్తుందని ఎక్జయిటింగ్‌గా చూస్తున్నారు ఫ్యాన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

