Rashmika Mandanna | రష్మిక మందన్నా ఆశలన్నీ ఆ రెండు సినిమాలపైనే..!
పుష్ప.. ది రైజ్ (Pushpa: The Rise)తో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). అయితే పుష్ప తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకం చేసినా.. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో మాత్రం వెనుకబడిందని సినీ జనాలు తెగ చర్చించుకుంటున్నారు.
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). గీత గోవిందం సినిమాతో తెలుగులో కమర్షియల్ హిట్టు అందుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. తన క్యూట్ యాక్టింగ్, డ్యాన్స్, లుక్‌తో నేషనల్ క్రష్‌గా మారిపోయిన రష్మిక మందన్నా పుష్ప.. ది రైజ్ (Pushpa: The Rise)తో బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఈ సినిమా రష్మికకు జాతీయ స్థాయిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చి పెట్టింది. అయితే పుష్ప తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకం చేసినా.. బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో మాత్రం వెనుకబడిందని సినీ జనాలు తెగ చర్చించుకుంటున్నారు.
పుష్ప తర్వాత వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఆశించిన టాక్ తెచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత విడుదలైన సీతారామం మంచి హిట్‌గా నిలిచినా.. ఆ క్రెడిట్ అంతా దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ ఖాతాలో పడిపోయింది. అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై చిత్రంలోనూ నటించి బాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది రష్మిక . ఇది కూడా ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ సంవత్సరం దళపతి విజయ్ నటించిన వారిసు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచినా.. రష్మిక పాత్రకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇక బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి రెండో హిందీ ప్రాజెక్ట్ మిషన్ మజ్నులో నటించింది. నెట్‌ఫ్లిక్స్ లో డైరెక్టుగా రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సరైన బ్రేక్ లేని రష్మిక.. మళ్లీ ట్రాక్‌పైకి వచ్చే ప్రయత్నాల్లో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ (Animal)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరోవైపు సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప.. ది రూల్‌లో కూడా నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక ఫోకస్ అంతా ఈ రెండు సినిమాలపైనే ఉంది. ఈ రెండు సినిమాల ఎలాగైనా ఫాంలోకి రావాలని చూస్తుందట. ఈ మూవీస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.
Read Also :
Sunny Leone | సన్నీలియోన్ ఇంతకీ ఎక్కడికెళ్లిందో.. ట్రెండింగ్‌లో వీడియో
Dasara | దసరా నుంచి Mainaru VettiKatti సాంగ్‌కు నాని డ్యాన్స్
Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

