Rashmika Mandanna | అప్పుడు విజయ్‌ని చూసి భయపడ్డా: రష్మిక మందన్న
వెండితెరపై హిట్‌పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి యువత ఫిదా అవుతుంటారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో ఈ జంట కలిసి నటించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కుటుంబంతో రష్మిక సన్నిహితంగా ఉంటుంది.
Rashmika Mandanna | వెండితెరపై హిట్‌పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అగ్ర తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి యువత ఫిదా అవుతుంటారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో ఈ జంట కలిసి నటించిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ కుటుంబంతో రష్మిక సన్నిహితంగా ఉంటుంది. దాంతో వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను విజయ్, రష్మిక అనేక సందర్భాల్లో ఖండించారు.
తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని, ఇద్దరం బెస్ట్‌ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘గీత గోవిందం’ సినిమా షూటింగ్ రోజులను గుర్తుచేసుకుంది రష్మిక. విజయ్‌తో కలిసి నటించేందుకు తొలుత కాస్త భయపడ్డానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘కొత్త వ్యక్తులతో నేను అంత త్వరగా కలిసిపోలేను. వారితో మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే ‘గీత గోవిందం’ సెట్లో తొలిసారి విజయ్‌తో కలిసి నటించేందుకు భయపడ్డా. అతని వ్యక్తిత్వం తెలిసే కొద్ది మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయాం. విజయ్ చాలా కూల్‌గా ఉంటాడు. ఆయన సెట్లో ఉంటే అందరిలో పాజిటివ్ ఎనర్జీని నింపుతాడు’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

