Randeep Hooda | ప్రేయసిని పెళ్లాడిన రణ్‌దీప్ హుడా.. నెట్టింట పిక్స్ వైరల్
Randeep Hooda | ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda) ఓ ఇంటివాడయ్యాడు. మోడల్, నటి లిన్ లైస్రామ్ (Lin Laishram)ను ఆయన ప్రేమ వివాహం (Wedding) చేసుకున్నాడు.
Randeep Hooda | ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా (Randeep Hooda) ఓ ఇంటివాడయ్యాడు. మోడల్, నటి లిన్ లైస్రామ్ (Lin Laishram)ను ఆయన ప్రేమ వివాహం (Wedding) చేసుకున్నాడు. మణిపూర్ రాజధాని ఇంపాల్ (Imphal)లోని ఓ దేవాలయంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. మణిపూర్ (Manipur) సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటైంది. ఈ మేరకు పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా రణ్‌దీప్ హుడా ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు, పలువురు ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
లిన్ లైస్రామ్‌తో రణ్‌దీప్ గత కొన్ని రోజులుగా డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము వివాహం చేసుకోబోతున్నాం అంటూ ఇటీవలే సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. ‘మహాభారతంలో మణిపుర్ యువరాణి చిత్రాంగదను అర్జునుడు ఎక్కడ వివాహం చేసుకున్నాడో.. అక్కడే మేము ఒక్కటి కాబోతున్నాం. ఈ నెల 29న ఇంపాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో మా (రణ్‌దీప్ హుడా, లిన్ లైస్రామ్) పెళ్లి జరగనుంది. త్వరలోనే ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నాం. మా ప్రయాణానికి మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం’ అని రణ్‌దీప్ హుడా ఇన్‌స్టాలో రాసుకోచ్చాడు.
2001లో రిలీజైన మన్సూన్ వెడ్డింగ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు రణ్‌దీప్ హుడా. ఇక ఆయన నటించిన చిత్రాలలో ‘జిస్మ్ 2’, ‘బాంబే టాకీస్’, ‘కిక్’, ‘హైవే’ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ప్రస్తుతం బీజేపీ ప్రాపగాండా మూవీ ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ చిత్రంలో నటిస్తున్నాడు.
Congratulations to Randeep Hooda (From Haryana) & Lin Laishram (From Manipur)!
The amazing couple solemnised their marriage in a very beautiful traditional Meitei wedding ceremony in Imphal, Manipur.
May your love grow stronger every passing year !#LinLaishram @RandeepHooda pic.twitter.com/zh2lz6rE2P— Kiren Rijiju (@KirenRijiju) November 29, 2023
Also Read..
TS Assembly Elections | ఓటేసిన సినీ ప్రముఖులు
lokesh kanagaraj | లోకేశ్ కనగరాజ్ తొలి ప్రొడక్షన్ వెంచర్ ఇదే.. FightClub లుక్ వైరల్
Naga Chaitanya | నాగచైతన్య కలిసి పనిచేయాలనుకుంటున్న డైరెక్టర్లు వీళ్లే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

