lokesh kanagaraj | లోకేశ్ కనగరాజ్ తొలి ప్రొడక్షన్ వెంచర్ ఇదే.. FightClub లుక్ వైరల్
lokesh kanagaraj | 2016లో తమిళ్ అంథాలజీ ఫిల్మ్ Aviyal డైరెక్టర్ కమ్ రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj). 2019లో కార్తీ నటించిన ఖైదీ (Kaithi) సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఫోకస్‌ను తనవైపునకు తిప్పుకున్నాడు. లోకేశ్ కనగరాజ్ హోం బ్యానర్ GSquad ప్రొడక్షన్స్ లాంఛ్ చేశాడని తెలిసిందే.
lokesh kanagaraj | ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా.. లేదా.. పోకిరి సినిమాలోని ఈ ఫేమస్ డైలాగ్ తెలియని వారుండరు. ఈ డైలాగ్‌ను పర్ఫెక్ట్గా అప్లై చేసే డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj). 2016లో తమిళ్ అంథాలజీ ఫిల్మ్ Aviyal డైరెక్టర్ కమ్ రైటర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. 2019లో కార్తీ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఖైదీ (Kaithi). లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది.
ఈ సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఫోకస్‌ను తనవైపునకు తిప్పుకున్నాడు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లోకేశ్ కనగరాజ్ హోం బ్యానర్ GSquad ప్రొడక్షన్స్ లాంఛ్ చేశాడని తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్లో వచ్చే మొదటి సినిమాను ప్రకటించేశాడు. Uriyadi ఫేం విజయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ క్లబ్ (FightClub) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. విజయ్ కుమార్ అర్థనగ్నంగా కనిపిస్తుంటే.. పక్కనే అతని గ్యాంగ్ ఉంది.
అబ్బాస్ ఏ రహ్మత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు. 2023 డిసెంబర్లో థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించాడు. రిలీజ్ డేట్‌పై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది. లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్‌తో తెరకెక్కిస్తున్న తలైవా 171 (Thalaivar 171) పై ఫోకస్ పెట్టాడు.
FightClub లుక్ వైరల్..
#FightClub – The bravest gang will meet you all soon! 👊@Dir_Lokesh @Vijay_B_Kumar @reelgood_adi @Abbas_A_Rahmath @reel_good_films #GovindVasantha @editorKripa @leonbrittodp #kannanganpat @renganaath_R @VickyStunt_dir @sasivilliers. @EzhuArtdirector @Dinesh_1401… pic.twitter.com/HNMiOgs9es
— GSquad (@GSquadOffl) November 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

