ప్రతి అంశాన్నీ ఆస్వాదించా
దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పానిండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ ఎట్టకేలకు ఈ గురువారం థియేటర్లలో విడుదలైంది. అంతేకాదు, అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటున్నది
దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పానిండియా పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ ఎట్టకేలకు ఈ గురువారం థియేటర్లలో విడుదలైంది. అంతేకాదు, అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటున్నది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా బిగ్ స్క్రీన్‌పై విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ‘రామాయణ’ అందించిన గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని తన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘రామాయణం ఓ అద్భుతం. ముఖ్యంగా వనవాసం నుంచి రాముడిగా రణబీర్ చూపిన ఔన్నత్యం ప్రశంసనీయం.
సీతగా సాయిపల్లవి ఎంతో హుందాగా కనిపించారు. రావణుడిగా యశ్ ప్రజెన్స్ వండర్. సినిమాలోని ప్రతి అంశాన్నీ ఆస్వాదించాను. ఇంతటి ప్రతిష్టాత్మకమైన విజన్‌ను అద్భుతంగా ఆవిష్కరించిన నమిత్ మల్హోత్రా, నితేశ్ తివారీలకు అభినందనలు. చిత్రబృందానికి నా శుభాభినందనలు’ అంటూ రాజమౌళి పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

