HomeCinemaRanbir Kapoors Animal With Sandeep Reddy Vanga Will Be Pan World Film
Ranbir Kapoor | ‘యానిమల్’ పాన్ వరల్డ్ సినిమా
‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్' సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర-1’ తర్వాత రణ్‌బీర్‌కపూర్ నటించిన సినిమా ఇదే కావడం, ‘అర్జున్‌రెడ్డి’ బాలీవుడ్ రీమేక్ ‘కబీర్‌సింగ్' తర్వాత డైరెక్టర్ సందీప్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి.
‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బ్రహ్మాస్త్ర-1’ తర్వాత రణ్‌బీర్‌కపూర్ నటించిన సినిమా ఇదే కావడం, ‘అర్జున్‌రెడ్డి’ బాలీవుడ్ రీమేక్ ‘కబీర్‌సింగ్’ తర్వాత డైరెక్టర్ సందీప్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. కొన్ని నెలల క్రితం విడుదల చేసిన ప్రీటీజర్ కూడా ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, టీ సిరీష్ భూషణ్‌కుమార్ సినిమా గురించి మాట్లాడారు.
కంటెంట్ పరంగా ఇదొక పాన్ వరల్డ్ సినిమా అని చెప్పారు. హార్ట్‌టచింగ్ ఫ్యామిలీ డ్రామాతో పాటు యాక్షన్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలిపారు. ‘ రణ్‌బీర్‌కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ మరో స్థాయిలో ఉంటుంది. యూనివర్సల్ ఎమోషనల్ కంటెంట్‌తో దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు’ అని భూషణ్‌కుమార్ చెప్పారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.