Animal | రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ తెలుగులోనూ విడుదల కానుందా?
Animal | అప్పటివరకు టాలీవుడ్ సినిమాలు ఓ మూస ధోరణిలో వెళ్తున్నాయి. అప్పుడే ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. గతంలో ‘శివ’కి ముందు శివ తర్వాత అనే విధంగా ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’కి ముందు అర్జున్ రెడ్డి తర్వాత అని పిలుస్తున్నారు. టాలీవుడ్ గేమ్ చేంజర్‌గా ఈ చిత్రం నిలిచింది. సందీప్ రెడ్డి విజన్‌కు, టేకింగ్‌కు సినీప్రముఖులు సైతం ఆశ్చర్యంలో పడ్డారు. 2017లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత సందీప్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో అని ఆసక్తి నెలకొంది. కానీ సందీప్ అర్జున్ రెడ్డి చిత్రాన్ని హందీలో షాహిద్ కపూర్‌తో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక బాలీవుడ్లో ఈ చిత్రం కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రంతో షాహిద్ రూ.300కోట్ల క్లబ్లో అడుగుపెట్టాడు.
ఈ చిత్రం తర్వాత రన్బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కాశ్మీర్లో ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అనీల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషన్ కుమార్, కృష్ణకుమార్, మురద్ కేతని, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

