రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘విరాటపర్వం’. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. జూలై 1న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..ఇంకాస్త ముందుగానే తెరపైకి రాబోతున్నది.
జూన్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించారు. నక్సలిజం నేపథ్యంలో 1990 దశకంలో జరిగిన కథతో ఈ సినిమా రూపొందింది. రానా కామ్రేడ్ రవన్న పాత్రలో నటిస్తుండగా…వెన్నెల పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ప్రియమణి, నందితాదాస్, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి, సంగీతం : సురేష్ బొబ్బిలి.