విరాట పర్వం సినిమాతో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నటన పరంగా రానాకు మంచి మార్కులు పడ్డాయి. కాగా ఈ భీమ్లా నాయక్ యాక్టర్ సర్ప్రైజ్ అప్డేట్తో, సస్పెన్స్ లుక్‌తో అందరికీ గుడ్‌న్యూస్ అందించాడు. రానా తాజాగా ట్రైన్ టికెట్ టైగర్ (Train Ticket Tiger)పోస్టర్ అందరితో పంచుకున్నాడు.
టైటిల్ చాలా కొత్తగా ఉండటమే కాదు.. రానా రైల్వే ప్లాట్ ఫాంపై పులి చారలతో డిజైన్ చేసిన లుంగీ వేసుకుని, రైల్వే అధికారిగా స్టైలిష్‌గా న్యూ అవతార్‌లో కనిపిస్తున్నాడు. అంతేకాదు రేపే ప్రీమియర్ కాబోతుందని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఇంతకీ ఇది కొత్త సినిమానా..? లేదా సిరీస్ టైటిల్ లుక్ పోస్టరా..? లేదంటే యాడ్ లుక్ మాత్రమేనా..? అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టాడు.
దీనిపై రానా రేపు అందరికీ ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. రానా మరోవైపు బాబాయి వెంకటేశ్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ నెట్ ఫ్లిక్స్ ప్రాజెక్ట్ విడుదలకు రెడీ అవుతోంది.
సస్పెన్స్ లుక్‌తో రానా అప్డేట్..
Premiering on your screens tomorrow! #TrainTicketTiger pic.twitter.com/CWhqUBGplp
— Rana Daggubati (@RanaDaggubati) January 4, 2023