Peddi | టాలీవుడ్లో ఇటీవల విడుదలైన సినిమాల్లో ప్రత్యేక కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బైకర్. శర్వానంద్ హీరోగా నటించిన ఈ రేసింగ్ బ్యాక్‌డ్రాప్ ఎమోషనల్ డ్రామా మంచి స్పందనను సొంతం చేసుకుంది. దర్శకుడు అభిలాష్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాపై తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది. ‘బైకర్’ గురించి చాలా మంచి విషయాలు వింటున్నానని, ఇలాంటి అరుదైన కాన్సెప్ట్‌తో సినిమా తీసినందుకు యూవీ క్రియేషన్స్‌కు హ్యాట్సాఫ్ అంటూ చరణ్ ప్రశంసలు కురిపించారు.
ఇక ఈ సినిమాలో శర్వానంద్, డా. రాజశేఖర్ నటనకు మంచి స్పందన వస్తుండటం ఆనందంగా ఉందని చరణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రి–కొడుకు భావోద్వేగాలను హైలైట్ చేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు అభిలాష్ కృష్ణ ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్‌ను ఎంచుకుని తెరకెక్కించడం గొప్ప విషయమని రామ్ చరణ్ అభినందించారు. ప్రస్తుతం కమర్షియల్ ఫార్ములా సినిమాల మధ్య ఇలాంటి కొత్త ప్రయత్నాలు రావడం ఇండస్ట్రీకి మంచి సూచిక అని ఆయన అభిప్రాయపడ్డారు.
రామ్ చరణ్ వంటి స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ ప్రశంసలు ‘బైకర్’ సినిమాకు మరింత హైప్ తీసుకువచ్చాయి. ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతున్న ఈ చిత్రం, ఇప్పుడు మరింత ప్రేక్షకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. బైకర్ పై రామ్ చరణ్ చేసిన కామెంట్స్ సినిమా యూనిట్‌కు పెద్ద బూస్ట్‌గా మారాయి. శర్వానంద్ కెరీర్లో మరో సక్సెస్‌గా ఈ చిత్రం నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి మంచి టాక్ వచ్చింది. పెద్ది కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేయనుందని అంటున్నారు.