రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత దిల్‌రాజు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా శంకర్ తనదైన శైలి సామాజికాంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారని సమాచారం. ఈ మధ్యే రామ్‌చరణ్‌కు లుక్కు సంబంధించిన ఓ వీడియో ఆన్లైన్లో ప్రత్యక్షమయింది. ఇందులో ఆయన ధోతీ కట్టుకొని సైకిల్‌పై వెళుతున్నాడు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ కావడమే కాకుండా సినిమాలో రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయోననే ఆసక్తినిరేకెత్తించింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘సర్కారోడు’ అనే టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారని సమాచారం. ఈ నెల 27 రామ్‌చరణ్ పుట్టినరోజును పురస్కరించుకొని టైటిల్‌ను ప్రకటిస్తారని అంటున్నారు.