Apoorva Lakhia | రాంచరణ్ అనుకోకుండా కాల్ చేస్తాడు.. జంజీర్ డైరెక్టర్ అపూర్వ లాఖియా
Apoorva Lakhia | అపూర్వ లాఖియా (Apoorva Lakhia) డైరెక్షన్లో తెరకెక్కిన జంజీర్ (Zanjeer) తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్ (Ram Charan). అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ ఎఫెక్ట్ రాంచరణ్‌తో ఉన్న బాండింగ్‌పై ఏదైనా ప్రభావం చూపించిందా.. అనే ప్రశ్నకు అపూర్వ లాఖియా స్పందించాడు.
Apoorva Lakhia | అపూర్వ లాఖియా (Apoorva Lakhia) డైరెక్షన్లో తెరకెక్కిన జంజీర్ (Zanjeer) సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ ఎఫెక్ట్ రాంచరణ్‌తో ఉన్న బాండింగ్‌పై ఏదైనా ప్రభావం చూపించిందా.. అనే ప్రశ్నకు అపూర్వ లాఖియా స్పందించాడు. జంజీర్ ఫలితం తమ బాండింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపించలేదన్నాడు.
అయితే ఇప్పుడు రాంచరణ్ తన కాల్స్‌ను అస్సలు లిఫ్ట్ చేయడం లేదన్నాడు అపూర్వ లాఖియా. కానీ ఆయన సతీమణి ఉపాసన తనకు రిప్లై ఇచ్చారని చెప్పాడు. రాంచరణ్ నాకు మంచి స్నేహితుడు. బాక్సాఫీస్ వద్ద జంజీర్ అంతగా ఆడకపోయినా.. హైదరాబాద్‌లోని రాంచరణ్ ఇంటికి చాలా సార్లు వెళ్లాను. కానీ ఇప్పుడు నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పాడు.
ఆర్ఆర్ఆర్ సమయంలో రాంచరణ్‌కు ఏదైనా మెసేజ్ పెట్టారా..? అని అడుగగా.. రాంచరణ్ ఉక్రెయిన్ నుంచి కాల్ చేసి నన్నేం చేస్తున్నారని అడిగారు. పెద్ద పనంటూ ఏమీ చేయడం లేదని చెప్పా. సెకండ్ యూనిట్‌కి సంబంధించి రెండు మూడు యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేయాలి.. మీరొచ్చి చేస్తారా? అని అడిగారు. నేను మీ దగ్గరికి వస్తానని రాంచరణ్‌తో అన్నాను.
ఆ తర్వాత రాంచరణ్ మళ్లీ ఫోన్ చేసి మీరు చేయగలరా? అని అడిగారు. అయితే నేను ఏదో షూటింగ్ కానీ, వేరే ఏదో పనిలో ఉండటం వల్ల అప్పుడు వెళ్లలేకపోయాను. నేను రాంచరణ్‌తో మాట్లాడింది అదే చివరిసారి అనుకుంటున్నా. రాంచరణ్ అనుకోకుండా నాకు కాల్ చేస్తాడు కానీ అతను నా కాల్స్‌కు మాత్రం రిప్లై ఇవ్వడంటూ చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
Udta Teer | ఇండియాలో పాకిస్థాన్ ఏజెంట్.. నవ్వులు పూయిస్తున్న ‘ఉడ్తా తీర్’ కొత్త ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

