Sri Ram | తెలుగు తెరపై శ్రీరాముడిగా మెప్పించిన స్టార్స్..!
రామకథతో వచ్చిన తొలి సినిమా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో యడవల్లి సూర్యనారాయణ రాముడి పాత్రలో కనిపించారు.
రామకథ మధురం. రామచరిత అద్భుతం. రామచంద్రుడి జీవితం ఆదర్శప్రాయం. భారతీయ ఇతిహాస గాథల్లో రామాయణానికి ఉన్న స్థానం ఉన్నతమైనది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు అజ‘రామ’రం. రామాయణం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది మర్యాదాపురుషోత్తముడే. అలాంటి మహోన్నతమైన శ్రీరాముడి పాత్రలో ఒదిగిపోయి వెండితెరకు వన్నె తెచ్చిన నటులెందరో! దేశమంతా రామనామాన్ని స్మరిస్తున్న సందర్భాన వెండితెర రాములవారి గురించి ప్రత్యేక కథనం…
Sri Ram | రామకథతో వచ్చిన తొలి సినిమా ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకం’. 1932లో ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో యడవల్లి సూర్యనారాయణ రాముడి పాత్రలో కనిపించారు. ఈయన రంగస్థల కళాకారుడు.. తొలితరం తెలుగు సినీ నటుడు. ఆ తర్వాత కొంత మంది రాముడి పాత్రను పోషించినా తెలుగు నాట మాత్రం రాముడు అంటే నందమూరి తారక రామారావే గుర్తుకువస్తారు. వెండితెర శ్రీరాముడిగా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా చెరగని ముద్రను వేసుకున్నారు ఎన్టీఆర్. రాముడు అంటే ఇలాగే ఉంటాడా అన్నట్లు ఆ పాత్రలో ఇమిడిపోయారాయన. తన నటనతో నవరసాలు పండించారు. సీతాదేవి ఘట్టంలో విషాదాన్ని, రావణ సంహారంలో కోపాన్ని, మహారాజుగా శాంతాన్ని.. ఇలా సందర్భానుసారం పాత్రలో తనదైన నటకౌశలాన్ని ఒలకించి ఔరా అనిపించారు. ‘సంపూర్ణ రామాయణం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రామాంజనేయ యుద్ధం’ తదితర సినిమాల్లో రాముడి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాత రాముడిగా
మెప్పించిన నటుడు హరనాథ్. ఎన్టీఆర్ దర్శకత్వంలోనే వచ్చిన ‘సీతారామ కల్యాణం’ సినిమాతోపాటు ‘శ్రీరామ కథ’ చిత్రంలోనూ హరనాథ్ రాముడిగా నటించారు. ‘లవకుశ’ సినిమాలో లక్ష్మణుడిగా మెప్పించిన కాంతారావు ‘వీరాంజనేయ’తోపాటు పలు చిత్రాల్లో రాముడి పాత్రలో నటించారు. అయితే ఎన్టీఆర్, కాంతారావు కంటే ముందే అక్కినేని నాగేశ్వర్రావు ‘సీతారామ జననం’ సినిమాలో రాముడి పాత్రతో తెరంగేట్రం చేశారు. శ్రీరాముడిగా శోభన్‌బాబు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’లో శ్రీరాముడిగా నటించారీ అలనాటి సోగ్గాడు. శోభన్‌బాబు తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మరో రామాయణ గాథ ‘సీతా కల్యాణం’. ఈ చిత్రంలో జయప్రద సీతగా నటిస్తే మళయాల నటుడు రవి శ్రీరాముడిగా మెప్పించారు. ఉత్తరాదివారికి అయోధ్య ఎలాగో.. దక్షిణాదివారికి భద్రాచలం అంతే.
ఇక భద్రాచలం నేపథ్యంలో తెరకెక్కిన ఎన్నో సినిమాలు వెండితెరను రామమయం చేశాయి. ఇదే భద్రాద్రి నేపథ్యంలో తెరకెక్కిన ‘శ్రీరామదాసు’ సినిమాలో సుమన్ రామచంద్రుడి పాత్రలో అలరించారు. హీరో శ్రీకాంత్ ‘దేవుళ్లు’ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కొద్దిసేపే కనిపించినప్పటికీ మెప్పించారు. రామాయణంపై వచ్చిన మరో అద్భుత దృశ్యకావ్యం ‘శ్రీరామరాజ్యం’. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అద్భుతంగా నటించారు. నందమూరి మూడోతరం నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన నట జీవితాన్ని ‘రామాయణం’ చిత్రంలో బాల రాముడి పాత్రతో ప్రారంభించారు. ఇలా నందమూరి ఫ్యామిలీ నుంచి మూడు తరాల హీరోలు వెండితెర రాముడిగా మెప్పించడం మహాద్భుతమే. ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం పెద్ద ఎత్తున విమర్శల పాలైనప్పటికీ ప్రభాస్‌కు తన కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర దక్కినట్లయింది. ఇలా చాలా మంది తెలుగు హీరోలు శ్రీరాముడి పాత్రలో నటించి మెప్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

