టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). శరత్ మండవ (Sarat Mandava) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ (Rajisha Vijayan) ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్‌ను మూవీ లవర్స్ కు అందించింది రవితేజ అండ్ టీం. రేపు ఉదయం 10.08 గంటలకు సినిమాపై భారీ అప్ డేట్‌ను అందించనున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఇప్పటివరకున్న సమాచారం ప్రకారం రేపు సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి రవితేజ టీం అభిమానులను కోసం ఎలాంటి అప్ డేట్ ఇస్తుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. మేకర్స్ ఇప్పటికే రామారావు టీజర్‌ను విడుదల చేయగా..మంచి స్పందన వస్తోంది. ఈ మూవీలో నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
It's DUTY time 😎#RamaRaoOnDuty MASSive announcement tomorrow at 10:08 AM 💥💥@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @Cinemainmygenes @sathyaDP @sahisuresh @RTTeamWorks @SLVCinemasOffl pic.twitter.com/6Zy6ICUNNH
— SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2022
ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్.దీంతోపాటు రవితేజ మరోవైపు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు త్రినాథ రావు నక్కినతో ధమాకా సినిమా చేస్తున్నాడు.