ప్రేక్షకులను సరికొత్త రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి..బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది అవతార్. సినీ లవర్స్ కు అద్బుతమైన సినిమాలు అందించిన హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ (James Cameron) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం టైటానిక్ లాంటి సినిమా తర్వాత మళ్లీ సినీ వరల్డ్‌లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్ (Avatar 2) ను రూపొందించే పనులపై చాలా కాలంగా వర్కవుట్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అవతార్ 2 ఇపుడు మళ్లీ తెరపైకి వచ్చింది. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో అవతార్ 2 ట్రైలర్ (Avatar 2 trailer)కు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. మే 6న అవతార్ 2 ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న అవతార్ 2 ఇదివరకెన్నడూ లేని వీఎఫ్ఎక్స్ తో ప్రేక్షకులకు అద్బుతమైన అనుభూతిని కలిగించేలా ఉండనుందట.
ఈ క్రేజీ సీక్వెల్ తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. జేమ్స్ కామెరాన్ మరోసారి తన కలల ప్రపంచంలోకి సినీ జనాలను ఎలా తీసుకెళ్తాడోనని చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.