RAPO20 | దున్నతో రామ్.. స్టన్నింగ్ పోస్టర్‌తో RAPO20 కొత్త అప్డేట్
బోయపాటి శ్రీను (Boyapati Srinu). ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni) హీరోగా RAPO20ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను అభిమానులతో పంచుకున్నాడు రామ్ పోతినేని.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను (Boyapati Srinu). అఖండ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బోయపాటి ఇప్పటికే ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni) హీరోగా RAPO20ను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను అభిమానులతో పంచుకున్నాడు రామ్ పోతినేని. వస్తున్నాం.. ఈ అక్టోబర్‌లో కలుద్దాం.. అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలియజేశాడు రామ్.
స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న రామ్ ఓ గుడి ముందు భారీ దున్నపోతు ముక్కుతాడు పట్టుకొని వస్తున్న స్టిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజా పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. రామ్ ఏదైనా యాక్షన్ సీన్లో పాల్గొన్నపుడు తీసిన స్టిల్ అయి ఉంటుందా..? అని చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్.ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించే యాక్టర్లు , సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.
రామ్ పోతినేని గతేడాది లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాలో నటించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ సారి బోయపాటి శ్రీనుతో పక్కా కమర్షియల్ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు రామ్.
RAPO20 స్టన్నింగ్ పోస్టర్..
VASTUNAAM! See you this October!🔥#BoyapatiRAPO pic.twitter.com/MqXVHCnSiF
— RAm POthineni (@ramsayz) March 27, 2023
Read Also :
Niharika Konidela | నెట్టింట్లోకి నిహారిక కలర్‌ఫుల్ రీఎంట్రీ.. పుకార్లపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
NTR 30 | ఎన్టీఆర్ 30 స్టన్నింగ్ అప్డేట్.. ఫస్ట్ యాక్షన్ సీన్ ఇదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

